Andhra Pradesh levies Re 1 road development cess on petrol, diesel
#Andhrapradesh
#Ysrcp
#Ysjagan
#Petrol
#Diesel
#Apgovt
#Middleclass
ఆంధ్రప్రదేశ్‌లో వాహనదారులకు వైసీపీ ప్రభుత్వం షాకిచ్చింది. రెండు నెలలు తిరక్కుండానే పెట్రోలు, డీజిల్‌పై మరోసారి కొత్త పన్నును విధించింది. పెట్రోల్, హై స్పీడ్ డీజిల్‌పై ప్రతి లీటర్‌కు ఒక్క రూపాయి చొప్పున సెస్ విధిస్తూ ఏపీ సర్కార్ ఆర్డినెన్స్ జారీ చేసింది. ఇప్పటికే ఉన్న వ్యాట్‌కు అదనంగా ఈ రెండు ఉత్పత్తులపై రూపాయి చొప్పున సెస్ విధిస్తున్నట్లు వెల్లడించింది. డీలర్ వద్ద నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేయాలని ప్రభుత్వం ఆర్డినెన్స్‌లో పేర్కొంది. రహదారి అభివృద్ధి నిధి కోసం ఈ సెస్ వసూలు చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు